టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కాబోతుంది.
అయితే నేడు బన్నీ బర్త్‌డే కావడంతో ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 7వ తేదీనే పుష్ప టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ టీజర్లో కేవలం బన్నీ ‘తగ్గేదే లే’ అని చేప్పే డైలాగ్ ఒక్కటే ఉండగా.. బ్యాక్ గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ అదిరిపోయింది. అలాగే ఊర మాస్ లుక్కులో బన్నీ కనిపించాడు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతోంది.
అయితే తాజాగా ఈ టీజర్‌పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. `పుష్ప టీజర్ చూశాను .. చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉంది. పుష్పరాజ్ గా బన్నీ ‘తగ్గేదే లే’ .. అంటూ ట్వీట్ చేశారు చిరు. అలాగే బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీంతో చిరు ట్వీట్ వైరల్ అవుతోంది.