గెట్ రెడీ..తండ్రి బ‌ర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న మ‌హేష్‌?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళితో చేస్తాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని త్రివిక్ర‌మ్‌తో చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది.

కానీ, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కోసం రాసిన‌ కథని త్రివిక్రమ్ మహేష్‌తో చేయనున్నాడన్నాడ‌ట‌. ఈ చిత్రంపై మ‌హేష్ త‌న తండ్రి సూపర్ స్టార్ ‌కృష్ణ బర్త్‌ డే (మే 31) నాడు ప్ర‌క‌టించ‌నున్నాడ‌ట. కాగా, ఇప్ప‌టికే మ‌హేస్‌, త్రివిక్ర‌మ్‌ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు రాగా.. మూడో సారి ఎప్పుడెప్పుడు వీరిద్ద‌రూ జత క‌డ‌తారా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. మ‌రి తాజా వార్త‌లు నిజ‌మైతే.. ఫ్యాన్స్ అది గుడ్‌న్యూసే అవుతుంది.

Share post:

Popular