తండ్రి బ‌ర్త్‌డే నాడు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న మ‌హేష్‌?

నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీన 78వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ బ‌ర్త్‌డేను ఆయ‌న త‌న‌యుడు, టాలీవుడ్ ప్రిన్స్ ఓ స్పెష‌ల్ డేట్‌గా చూస్తుంటారు.

ఇక ప్ర‌తి ఏడాది తండ్రి బ‌ర్త్‌డే సందర్భంగా త‌న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తండ్రి బ‌ర్త్‌డే నాడు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌ట మ‌హేష్‌. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శలో ఉంది.

అయితే తండ్రి పుట్టినరోజుకు ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడికి మహేశ్‌ సూచించారట. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ అదే ప‌నిలో ఉన్నార‌ట‌. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధి ప్ర‌క‌ట‌న కూడా మే 31న రానుంద‌ని తెలుస్తోంది.

Share post:

Latest