`గీత‌ గోవిందం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

April 10, 2021 at 8:19 am

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `గీత గోవిందం`. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టించిన సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ 2018లో విడుద‌లై.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Lavanya tripathi Archives | Telugu360.com

ఈ సినిమాతో విజ‌య్‌, ర‌ష్మిక ఇద్ద‌రూ స్టార్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో మొద‌ట హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను అనుకోలేద‌ట‌. ముందు లావణ్య త్రిపాఠిని సంప్ర‌దించార‌ట‌. కానీ, ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా లావ‌ణ్య‌నే తెలిపింది.

తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న లావ‌ణ్య మాట్లాడుతూ‌..‘గీతా గోవిందం’ సినిమాలో హీరోయిన్‌గా మొదట తననే అనుకున్నారు. కానీ, అప్పటికే తనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా నేను ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఒక‌వేళ ఆ సినిమాలో నటించి ఉంటే తన పొజిషన్ వేరేలా ఉండేది అని చెప్పుకొచ్చింది.

`గీత‌ గోవిందం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts