ఎన్టీఆర్‌తో కొర‌టాల‌..మ‌రి బ‌న్నీ సినిమా ఎప్పుడంటే?

ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను కొర‌టాల శివతో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు.

- Advertisement -

అయితే ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన వెంట‌నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో నిరాశ చెందారు. ఎందుకంటే, ఇప్ప‌టికే అల్లు అర్జున్‌, కొర‌టాల శివ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం పుష్ప చేస్తున్న బ‌న్నీ.. నెక్ట్స్ కొర‌టాల‌తోనే చేస్తాడ‌ని అంద‌రూ ఫిక్స్ అయ్యారు.

Allu Arjun : Latest News, Videos and Photos on Allu Arjun - India.Com News

కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్‌తో సినిమాను ప్ర‌క‌టించాడు కొర‌టాల‌. దీంతో బ‌న్నీ సినిమా ఎప్పుడు ఉంటుంద‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మొద‌లైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం..కొర‌టాల‌, బ‌న్నీ కాంబో చిత్రం ఏప్రిల్‌ 2022 తర్వాత పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈలోపు బ‌న్నీ ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడు అన్న‌ది తెలియాల్సి ఉంది.

Share post:

Popular