ఎన్‌.ఐ.ఏ. ఆఫీసర్‌గా RX 100 హీరో..!?

టాలీవుడ్ లో ఆర్‌ఎక్స్‌ 100 మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ సంపాదించినా హీరో కార్తికేయ. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. తాన్యా రవిచంద్రన్‌ ఈ మూవీలో హీరోయిన్ గ నటించనుంది. సుధాకర్‌ కోమాకుల ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. టీ. ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న చిత్రమిది అని సరిపల్లి అన్నారు. ఇందులో కార్తికేయ ఎన్‌.ఐ.ఏ. ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్‌ ఎనెర్జిటిక్ గా ఉండనుంది అని అన్నారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామారెడ్డి మాట్లాడుతూ వీవీ వినాయక్‌ శిష్యుడైన శ్రీ సరిపల్లిని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.హీరో కార్తికేయ పాత్ర చాలా బాగుంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Share post:

Latest