వారిపైనే ఆశ‌లు పెట్టుకున్న నంద‌మూరి హీరో..హిట్ కొట్టేనా?

`శ్రీమంతుడు` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర నిర్మాత సంస్థ‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది.

- Advertisement -

ఇక ‘ఉప్పెన’తో సూప‌ర్ డూప‌ర్ హిట్​ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవ‌లె నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

అయితే వ‌ర‌స ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న క‌ళ్యాణ్ రామ్.. మైత్రీ మూవీ మేక‌ర్స్‌ బ్యానర్ ద్వారా ఖ‌చ్చితంగా సూపర్ హిట్‌ను దక్కించుకోవాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ట‌. మ‌రి క‌ళ్యాణ్ రామ్ ఆశ‌ప‌డిన‌ట్టుగానే.. మైత్రీ వారు హిట్ ఇస్తారో.. లేదో చూడాలి.

Kalyan Ram's new movie announced | TotalTelugu

Share post:

Popular