నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభ వార్త..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగాల భర్తీకి రెడీ చేస్తోంది. పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజున జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం.

ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కానుంది అంటే, గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు. గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు 6,099 , పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు భర్తీ కానున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సచివాలయాల్లో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ ఓకే చెప్పారు. దీంతో ఖాళీగా ఉన్న 6వేల 99 యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్‌ పోస్టులు కూడా భర్తీ కానున్నాయి.

Share post:

Latest