ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జ‌ట్ల వివ‌రాలు ఇవే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల బ‌ట్టి జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు తుది జట్టు అంచనా.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, కైల్ జెమీషన్, చాహల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్.

బెంగళూరుతో ఫస్ట్ మ్యాచ్‌కి ముంబయి తుది జట్టు అంచనా.. రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, పీయూస్ చావ్లా.

Share post:

Latest