ఐపీఎల్ 2021: ట్యాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021కు స‌మ‌యం ఆసన్నమైంది. మ‌రికాసేప‌ట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టోర్నీ ఫ‌స్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండ‌గా.. తాజాగా టాస్ వేశారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును టాస్ వ‌రించింది.

టాస్ విష‌యంలో ‌ఎప్పుడూ నిరాశ చెందుతున్న విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో టాస్ గెల‌వ‌డం విశేషం. ఇక టాస్ గెలిచిన విరాట్ బౌలింగ్ ను ఎంచుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ తొలిత బ్యాటింగ్ చేయనుంది.

Share post:

Latest