సూప‌ర్ థిల్లింగ్‌గా `ఒరేయ్ బామ్మర్ది’ టీజర్..!

April 9, 2021 at 7:13 pm

సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌ హీరోలుగా బిచ్చగాడు ఫేమ్‌ శశి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఒరేయ్ బామ్మర్ది`. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మిస్తున్నారు. సిద్ధూ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

తమిళంలో ‘శివప్పు మంజల్‌ పచాయ్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్‌ బామ్మర్ది’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా ఒరేయ్ బామ్మర్ది టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ టీజ‌ర్ ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా సాగ‌డంతో పాటు.. సినిమాపై అంచానాలు క్రియేట్ చేసే విధంగా ఉంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్‌లు పోటాపోటీగా నటిస్తార‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అలాగే ఈ టీజ‌ర్‌లో యాక్షన్ సీన్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి.

సూప‌ర్ థిల్లింగ్‌గా `ఒరేయ్ బామ్మర్ది’ టీజర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts