టీకా పంపిణీలో ఇండియా స‌రికొత్త రికార్డు!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ శ‌ర‌వేగంగా వ్య‌ప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయిపోతున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌పంచ‌దేశాల్లోనూ జోరుగా కొన‌సాగుతోంది.

అయితే టీకా పంపిణీలో తాజాగా ఇండియా స‌రికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపినీ చేసింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోస్ లను అందించ‌గా.. ప్రపంచంలో మరే దేశం కూడా ఈ ఫీట్ ను అందుకోలేక‌పోయింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక మందికి వ్యాక్సిన్ వేసిన ఏకైక దేశంగా ఇండియా నిలిచింది. కాగా, దేశంలో తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆపై రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పంపినీ చేయ‌నున్నారు అధికారులు.

Share post:

Latest