క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జ‌గ‌న్!

కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నానా తంటాలు పెడుతున్న క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు వెయ్యికి పైగా న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ క్యార్య‌క్ర‌మం కూడా జోరుగానే జ‌రుగుతోంది.

- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.

అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ..రాష్ట్రంలో కేవ‌లం మూడు నెలల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామ‌ని తెలిపారు. గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ వేసే విష‌యంపై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. గ్రామవాలంటీర్లు, ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే చేసి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.

Share post:

Popular