`వ‌కీల్ సాబ్‌`పై చిరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..వైర‌ల్‌గా ఓల్డ్ ఫొటో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోని క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఏప్రిల్ 9న అంటే రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ప‌వ‌న్ అన్న‌, మెగాస్టార్ చిరంజీవి వ‌కీల్ సాబ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. `చాలా కాలం తరువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో వ‌కీల్ సాబ్ చూస్తాను.

Image

ఈ సినిమా ఎలా ఉందో మీతో పంచుకోవడానికి తహతహలాడుతున్నాను.` అంటూ చిరు ట్వీట్ చేశారు. అంతే కాదు ఈ పోస్ట్‌కు ఓ ఓల్డ్ ఫొటో కూడా జ‌త చేశారు. ఈ ఫొటోలో పవన్ హెయిర్ స్టయిల్ ను దువ్వెనతో సరిచేస్తూ చిరు క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest