మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ `చావు కబురు చల్లగా`!

యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగ‌ళ్లపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ మార్చి 19న విడుద‌లైన ఈ చిత్రం ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. థియేటర్‌లోకి ఏ సినిమా వ‌చ్చినా.. కొన్ని రోజుల‌కే ఓటీటీలో కూడా విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో చావు కబురు చల్లగా విడుద‌ల కానుంది. తాజాగా స్ట్రీమింగ్ తేదీని కూడా ఆహా సంస్థ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఈ చిత్రం ఏప్రిల్ 26 నుంచి ఆహాలో స్రీమింగ్ కానుంది.

Image

Share post:

Popular