ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న ‘చేజింగ్’..!

కోలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవలే మాస్ మహరాజ రవితేజ నటించిన క్రాక్ మూవీలో వరలక్ష్మీ జయమ్మగా అలాగే నాంది మూవీలో లాయర్ ఆధ్య పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాగే తమిళంలో ఇటీవల చేజింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ బావున్నప్పటికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్‌కు ప్రేక్షకులు రాకపోవటంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది ఈ చిత్రం.

కే వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ కోబోతుండటం విశేషం. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని సింప్లీ సౌత్ ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నారు. చూడాలి మరి, బిగ్ స్క్రీన్ మీద నిరాశపరచిన ఈ మూవీ ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో.

Share post:

Latest