బ్రేకింగ్ : హాస్పిటల్‌లో అక్షయ్ కుమార్ ..!?

ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు అక్షయ్ తెలపగా, డాక్టర్ల సలహా మేరకు ముందస్తూ జాగ్రత్తగా హాస్పిటల్లో చేరినట్లు సోమవారం నాడు మరో ట్వీట్ చేస్తూ తెలిపాడు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను, ఈ ప్రార్థనలు వల్ల త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు.

అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు చిత్రంలో ఏకంగా 45 మంది జూనియర్ ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. ఇంకా బాలీవుడ్ ప్రముఖులై అయిన ఆమిర్ ఖాన్‌, ఆలియా భట్‌, ఫాతిమా సనా షేక్‌, కార్తీక్ ఆర్యన్‌, పరేష్ రావల్‌, మిలింద్‌ సోమన్‌లాంటి వాళ్లకు ఇప్పటికే కరోనా సోకిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో వేవ్ మరింత ఉద్ధృతంగా ఉండటంతో ఎన్నడూ లెన్నటి విధంగా 24 గంటల్లోనే కేసులు లక్ష దాటుతున్నాయి.

Share post:

Popular