బాలీవుడ్‌లో సంగీత దర్శకుడు రిఎంట్రీ?

ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ అతి త్వరలోనే‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2012లో హీరో ధనుష్‌ నటించిన 3 సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా అనిరుధ్‌ పరిచయమయ్యాడు. ఈ సినిమాలోని వై దిస్‌ కొలవెరి అనే సాంగ్ తో రికార్డు సృష్టించింది.

- Advertisement -

తన తొలి చిత్రంలోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న అనిరుధ్ ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వరుస చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. కాగా ఇపుడు ఓ హిందీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు అనిరుధ్. ఎల్‌.రాయ్‌ తెరకెక్కించనున్న కొత్త చిత్రానికి సంగీతం సమకూర్చేందుకు అనిరుధ్ కమిట్‌ అయినట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించే ఈ మూవీ ద్వారా అనిరుధ్‌ రవిచందర్‌ తొలిసారి బాలీవుడ్ లో పూర్తి స్థాయిలో సంగీతం సమకూర్చనున్నారు.

Share post:

Popular