`పుష్ప‌`లో మ‌ళ్లీ అలాంటి పాత్రే చేస్తున్న రంగమ్మత్త?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈమె పాత్రకు సంబంధించిన పలు వివ‌రాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న‌కు జోడీగా అన‌సూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు ఆమె ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడనుందట.

కాగా, అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుకుంది. ఇక ఇప్పుడు మ‌రోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే చేయ‌బోతున్న అన‌సూయ ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి.