`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. హిట్టే అందుకోలేక‌పోయాడు అఖిల్‌.

ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రం పూర్తి కాక‌ముందే త‌న ఐదో సినిమాను స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే నేడు అఖిల్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా అఖిల్ ఐదో సినిమా టైటిల్ మ‌రియు ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ఖ‌రారు కాగా.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో అఖిల్ అదిరిపోయాడ‌ని చెప్పాలి. చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ సూప‌ర్ స్టైలీష్‌గా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్‌గా వైర‌ల్‌గా అవుతోంది. ఇక ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది.

Image