`ఆచార్య‌`ను అప్పటికి షిఫ్ట్ చేస్తున్న చిరు-కొర‌టాల‌?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

- Advertisement -

ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు జరగాల్సిన షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు కరోనా కేసుల రోజురోజుకు పెరుగుతున్నాయి. టికెట్స్ రేట్స్ కూడా త‌గ్గాయి.

అందువ‌ల్ల‌, ఆచార్య విడుద‌ల‌ను వాయిదా వెయ్య‌డ‌మే మంచిద‌ని చిరు, కొర‌టాల‌తో పాటు నిర్మాత‌లు కూడా భావిస్తున్నార‌ట‌. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ జూన్ నెల లోకి షిఫ్ట్ చేసినట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జూన్ రెండో వారంలో ఈ సినిమా విడుదల ఉండొచ్చని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

Share post:

Popular