నాగబాబుకి ఇష్టమైన యాంకర్ ఎవరంటే ..!?

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు నాగబాబు. నటుడిగా, నిర్మాతగా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత బుల్లితెర పైన పలు సీరియళ్లలో నటించి అలరించారు. తరువాత జబర్ధస్త్ షో ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెర పై సందడి చేశారు. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో జబర్ధస్త్ యాంకర్ ‌పై కొన్ని ఆసక్తి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ హోస్ట్ ఎవరో చెప్పకనే చెప్పారు నాగబాబు.

తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఓ నెటిజన్, జబర్ధస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌లో మీకు ఎవరు ఫేవరెట్ అని అడగగా ఎప్పటికీ అనసూయనే హాట్ అంటూ నాటీగా సమాధానం ఇచ్చారు నాగబాబు.

Share post:

Popular