అర‌రే..బట్లర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైన బండ్ల గ‌ణేష్‌!

బండ్ల గ‌ణేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌.. నిర్మాతగా కూడా స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్ట‌ర్‌ను వెతికే ప‌నిలో ఉన్నాడు బండ్ల‌.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా బండ్ల తాజాగా బ‌ట్ట‌ర్ ఇంగ్లీష్‌తో అడ్డంగా బుక్కైపోయాడు. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌ను ఓ ఆటాడుకుంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధ‌రించ‌కుంటే భారీగా ఫైన్లు వేస్తున్నారు అధికారు. ఈ కార‌ణంగానే తాజాగా బండ్ల గ‌ణేష్‌కు కూడా రెండు వేల రూపాయ‌లు ఫైన్ వేశారు.

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపిన బండ్ల గ‌ణేష్‌..మాస్కు ధరించండి అనే ఉద్దేశంతో Where mask అని పేర్కొన్నాడు. కానీ అక్కడ ఉండాల్సిన పదం Wear. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తించి బండ్ల గణేశ్ ను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన మరో పోస్టు పెట్టారు. ఈసారి కూడా ఆయన ఆ పదాన్ని సరిగ్గా రాయలేక‌ Ware mask అని పేర్కొన్నారు. ఇకేముంది.. నెటిజ‌న్లు బండ్ల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Popular