ఏప్రిల్ 2న ఆర్ఆర్ఆర్ నుండి మరో క్రేజీ అప్డేట్ ‌‌..!?

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్‌. రౌద్రం రణం రుధిరం అంటే కాప్షన్. అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో న‌టించిన స్టార్స్ బ‌ర్త్‌డేల‌ను పుర‌స్క‌రించుకొని వారు పోషించిన పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆనంద‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫ‌స్ట్ లుక్‌కు టైం ఖరారు చేశాడు.

ఏప్రిల్ 2న అజ‌య్ దేవ‌గ‌ణ్ పుట్టినరోజు కావ‌డంతో ఈ సంద‌ర్బంగా ఆర్ఆర్ఆర్ నుండి అజ‌య్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు గురువుగా, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్.ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Share post:

Popular