నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులు హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి రాణించారు. వీరిలో బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో అగ్రహీరోగా ఉన్నారు. ఇక ఈ వంశంలో మూడో తరం వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరత్న ఉన్నారు. వీరిలో ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే హీరోగా ఉన్నారు.
ఇక నందమూరి ఫ్యామిలీలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ రెడీగా ఉన్నాడు. బాలయ్య వెండితెరంగ్రేటం ఎప్పుడు ఉంటుదనేది ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. శాతకర్ణి సినిమాలో మోక్షు చిన్న రోల్ చేస్తాడని అందరూ అనుకున్నా అది జరగలేదు.
ఇక మోక్షు డేట్స్ బాలయ్యకు సన్నిహితుడు అయిన ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి చేతుల్లో ఉన్నాయి. దీంతో మోక్షు డెబ్యూ మూవీ వారాహి బ్యానర్లోనే ఉండడం ఖాయమైంది. ఇక సాయి గతేడాది రానే వచ్చాడు రామయ్య అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించాడు…ఈ టైటిల్ మోక్షు కోసమే అనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే మోక్షు డెబ్యూ మూవీ విషయంలో బాలయ్య హడావిడిగా చేయాలని మాత్రం అనుకోవడం లేదు. అఖిల్ విషయంలో నాగార్జున ఎలా దెబ్బతిన్నాడో బాలయ్య స్వయంగా చూశాడు. దీంతో మోక్షు విషయంలో బాలయ్య హడావిడి చేసేందుకు ఇష్టపడడం లేదట. ఇదిలా ఉంటే మంగళవారం మోక్షు 23వ బర్త్ డే.
కొడుకు పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. గతంలో బాలయ్య మోక్షుకు గతంలో చాలా గిఫ్ట్‌లు పంపినా ఈ విషయంలో మాత్రం ఖరీదైన ఆడీ కారు గిఫ్ట్‌గా ఇవ్వడంతో మోక్షు ఫుల్ హ్యాపీ ఫీలయ్యాడట. ఇక మోక్షును ఓ మాంచి కమర్షియల్ మూవీతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నాడు.