అమరేంద్ర బాహుబలి దండయాత్ర ముందు.. రికార్డులన్నీ దాసోహమవుతున్నాయి. `సాహో` అంటూ సలామ్ కొడుతున్నాయి. దర్శక ధీరుడి టేకింగ్‌కు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్‌ల ప్రేక్షకులు బాహుబలి-2కి నీరాజనం పడుతున్నారు. దేశంలోనే కాదు ఓవర్సీస్‌లోనూ బాహుబలి-2 రికార్డులు తిరగరాస్తోంది. ఈ దెబ్బకి అంతకుముందు ఉన్న రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకో విశేషమేంటంటే.. బాహుబలి-1 రికార్డును బాహుబలి-2 అధిగమించింది. ఇతర హీరోలకు సరికొత్త టార్గెట్‌లు ఫిక్స్ చేస్తోంది.
బాహుబలి-2.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తోంది. విడుదలయిన ప్రతీ చోటా సరికొత్త చరిత్రను నమోదు చేస్తోంది. టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ.. బాహుబలి మానియాకు ప్రాంత బేధం లేకుండా అయింది. ఓవర్సీస్ లోనూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాహుబలి దెబ్బకు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీ కాంత్ రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయంటే.. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికాలో రెండు రోజుల్లోనే 8మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇది బాహుబలి-1 ఓవరాల్ కలెక్షన్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ సినిమా రాకతో, రెండు రోజుల కలెక్షన్లతో టాప్-10 సినిమాల లిస్ట్ ఒక్కసారిగా మారిపోయింది. అమెరికాలో కలెక్షన్ల పరంగా టాప్-10 సినిమాల వివరాలు ఇలా మారిపోయాయి.
- బాహుబలి-2ః 8 మిలియన్ డాలర్లు (రూ. 56 కోట్లు)
- బాహుబలి-1ః 7.51 మిలియన్ డాలర్లు (రూ. 52.59 కోట్లు)
- శ్రీమంతుడుః 2.89 మిలియన్ డాలర్లు (రూ. 20.23 కోట్లు)
- అ.. ఆ..== 2.45 మిలియన్ డాలర్లు (రూ. 17.15 కోట్లు)
- ఖైదీ నెం.150== 2.45 మిలియన్ డాలర్లు (రూ. 17.15 కోట్లు)
- నాన్నకు ప్రేమతోః 2.02 మిలియన్ డాలర్లు (రూ. 14.14 కోట్లు)
- అత్తారింటికి దారేదిః 1.90 మిలియన్ డాలర్లు (రూ. 13.30 కోట్లు)
8.జనతాగ్యారేజ్ః 1.80 మిలియన్ డాలర్లు (రూ. 12.60 కోట్లు)
- గౌతమిపుత్ర శాతకర్ణిః 1.66 మిలియన్ డాలర్లు (రూ. 11.62 కోట్లు
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుః 1.64 మిలియన్ డాలర్లు (రూ. 11.48 కోట్లు)