సెంటిమెంట్ల‌ను న‌మ్ముతోన్న ఎన్టీఆర్‌

మూడు వ‌రుస హిట్ల‌తో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మూడు హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిఫుల్ రోల్‌లో న‌టిస్తున్నాడు. మూడు హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావ‌డంతో జై ల‌వ కుశ‌పై ఇండ‌స్ట్రీలోను, టాలీవుడ్ వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఎన్టీఆర్ సెంటిమెంట్ల‌ను న‌మ్ముతున్నాడు.

జై ల‌వ కుశ సినిమాను సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌యూనిట్‌తో పాటు ఎన్టీఆర్ డిసైడ్ అయ్యార‌ట‌. ఎన్టీఆర్ చివ‌రి సినిమా జ‌న‌తా గ్యారేజ్ సెప్టెంబ‌ర్ 1నే రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ సెంటిమెంట్ ప్ర‌కార‌మే జై ల‌వ కుశను కూడా అదే రోజున రిలీజ్ చేయాల‌ని ఎన్టీఆర్ ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్ర చేస్తున్నాడు. ఏదేమైనా ఎన్టీఆర్ సెంటిమెంట్ల‌ను న‌మ్ముకోవ‌డం విచిత్ర‌మే. మ‌రి ఈ సెంటిమెంట్ జై ల‌వ కుశ‌ను ఎలాంటి హిట్ చేస్తుందో ?  చూడాలి.