ఈ హెడ్డింగ్ చూస్తే ఒక్కసారిగా స్టన్ అవ్వాల్సిందే. మెగాస్టార్ చిరు – మంచు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. వీరిద్దరి మధ్య ఎప్పుడైనా చిరు కోపం వచ్చినా తర్వాత ఇట్టే కలిసిపోతుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది.
గతేడాది అటాక్, శౌర్య వంటి వరుస పరాజయాలతో డీలా పడ్డ మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒక్కడు మిగిలాడు – గుంటూరోడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాలో ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ యాడ్ అవుతోంది. అదే మెగాస్టార్ చిరంజీవి రోల్.
అయితే ఆ పాత్ర అంటే కథలో కదిలే పాత్ర కాదు. కథలో వినిపించే పాత్ర. క్లుప్తంగా చెప్పాలంటే చిరు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారట. సినిమాలో ఓ కీలక టైంలో చిరు వాయిస్ ఓవర్ వినిపిస్తుందని తెలుస్తోంది. ఇక చిరు గత శుక్రవారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ దిశతో దూసుకెళుతోన్న ఘజీ సినిమాకు సైతం వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరి అదే ఘాజీ సెంటిమెంట్ గుంటూరోడుకు కూడా వర్క్ అవుట్ అయ్యి హిట్ అవుతుందేమో చూడాలి.కొత్త దర్శకుడు సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది.