వైసీపీ నుంచి టీడీపీలోకి మ‌రో 7 గురు ఎమ్మెల్యేలు

త‌న పార్టీ ఎమ్మెల్యేలు వ‌రుస‌గా త‌న‌కు షాకుల మీద షాకులు ఇస్తూ అధికార టీడీపీలోకి చేరిపోతుండ‌డంతో తీవ్ర గంద‌ర‌గోళంలో ఉన్న జ‌గ‌న్‌కు మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా కృష్ణా జిల్లాకు చెందిన పామ‌ర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి అధికార టీడీపీలో చేరిపోయారు.

క‌ల్ప‌న అలా పార్టీ కండువా మార్చేశారో లేదో అదే జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి కూడా టీడీపీలో చేరిపోతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం ఇలా జ‌రుగుతోందో లేదో మ‌రో పెద్ద బాంబు పేలింది.

వైసీపీ నుంచి మ‌రో 7 గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్న‌ట్టు ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతాయని ఏపీఎస్ కో-ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు.

ఈ రోజు విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న త్వరలో వైసీపీ నుంచి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతారన్నారు.

దళిత వ్యతిరేక విధానాల వల్లే వైసీపీని ఒక్కొక్క దళిత ఎమ్మెల్యే వీడుతున్నారని జూపూడి విమర్శించారు. జూపూడి బాంబుతో వైసీపీ నాయ‌కుల్లో మ‌రో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. వైసీపీకి షాక్ ఇచ్చే ఆ 7 గురు ఎమ్మెల్యేలు ఎవ‌రా అని ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల పేర్ల‌తో లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ 7 గురులో ప్ర‌తాప్ అప్పారావు, ర‌క్ష‌ణ‌నిధి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రి మిగిలిన 5 గురు ఎవ‌రా అన్న‌ది చూడాలి.