రిలీజ్‌కు ముందే చిరు ఖైదీ ఖాతాలో మ‌రో రికార్డు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రతి అంశంలోనూ అటు సినీ జ‌నాల‌ను, ఇటు ట్రేడ్ వ‌ర్గాల‌ను, ఇండ‌స్ట్రీని, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప‌దేళ్ల త‌ర్వాత ఈ సినిమాలో న‌టిస్తోన్న చిరు త‌న స్లిమ్ లుక్‌తో ప్రేక్ష‌కుల మ‌తి పోగొడితే…ఈ సినిమా లిరిక‌ల్ సాంగ్స్‌కు యూ ట్యూబ్‌లో వ‌స్తోన్న స్పంద‌న చిరు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఇక ఖైదీ నెంబ‌ర్ 150 ప్రి రిలీజ్ బిజినెస్ సైతం దిమ్మ‌తిరిగే రేంజ్‌లో జ‌రుగుతోంది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఖైదీ శాటిలైట్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఛానెల్ రూ. 13 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇక ఏరియాల వారీగా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.8.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 14 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైన విషయం తెలిసిందే. ఇక రీసెంట్‌గా తెలుగు సినిమా మార్కెట్ కీల‌క‌మైన నైజాం రైట్స్ రూ.14 కోట్ల‌కు అమ్ముడై స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

చిరు సినిమా వ‌చ్చి ప‌దేళ్లు అవుతున్నా..చిరుకు నైజాంలో ఉన్న క్రేజ్‌తో పాటు చిరు 150వ సినిమా కావ‌డం, చిరు పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ఉండ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు ఇంత పెద్ద మొత్తానికి ఈ సినిమా నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారు. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.