మన్యం పులి TJ రివ్యూ

సినిమా : మన్యం పులి
రేటింగ్ : 3/5
పంచ్ లైన్ : మంచి సినిమానే కానీ కొందరికే..

నటీనటులు : మోహన్ లాల్,కమలిని ముఖర్జీ,జగపతి బాబు తదితరులు.
సంగీతం : గోపి సుందర్
ఫైట్స్ : పీటర్ హెయిన్
నిర్మాత : సింధురపువ్వు కృష్ణ రెడ్డి
డైరెక్టర్ : వైశాక్

మోహన్ లాల్ గారి గురించి భాషా బేధం లేకుండా అందరికి తెలిసిన కంప్లీట్ యాక్టర్ లాల్ గారు.తెలుగులో ఎవరికైనా తెలియకుంటే ఎన్టీఆర్ జనతా గారేజ్ తో ఆ ఛాన్స్ కూడా లేదు,అంతలా రీచ్ అయిన క్యారెక్టర్ ఆ సినిమాలో ఆయనది.దాని తరువాత తెలుగులో మోహన్ లాల్ గారి డైరెక్ట్ గా మనమంతా తీసి తనలోని సాఫ్ట్ అండ్ ఎమోషనల్ నటుడ్ని చూపి మెప్పించారు.ఇప్పుడు మన్యం పులి అంటూ తనకే సొంతమైన పవర్ ఫుల్ మాస్ ఓరియెంటెడ్ యాంగ్రీ క్యారెక్టర్ తో మెప్పించారు.

మన్యం పులి అనగానే ఇదొక ఫారెస్ట్ బేస్డ్ బోల్డ్ స్టోరీ అని తెలుస్తూనే వుంది.లేని పోని అంచనాలతో సినిమాకి వెళ్లకుండా రెగ్యులర్ మూవీస్ కి కాస్త భిన్నంగా వుండాలని కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమా మంచి ఊరట.రెగ్యులర్ సినీ లవర్స్ కి మాత్రం ఇది ఎక్కే ఛాన్స్ లేదు.ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే దగ్గరయ్యే సినిమా ఇది.ఒక్క విషయం లో దర్శకుడ్ని మెచ్చుకువాల్సిందే..అదే తాను ఏదయితే కథని వూహించుకున్నాడో దాన్నుండి ఎక్కడా డీవియేట్ అవ్వకుండా కథకు తగిన న్యాయం చేసాడు.

అటవీ ప్రాంతం లో నివసించే ఓ కుటుంబం.రెండో బిడ్డకు జన్మనిస్తూ ఆ తల్లి కన్నుమూత,కళ్ళ ముందే తన తండ్రిని పెద్ద పులి చంపేయడం తో ఎలాగైనా పులిని చంపాలనే కసితో చిన్న వయసుతోనే పులిని చంపేయడం..తరువాత తమ్ముడికి అన్ని తానై పెంచి పెద్ద చేయడం.ఆ అటవీ ప్రాంతం లో ఎక్కడ పులి వున్నా ప్రజలను కాపాడ్డం కోసం వాటిని చంపుతూ వాళ్లందరికీ దేవుడవడం , తరువాత పట్నం మనుషులు వాళ్ళ కల్మషాలు హీరో జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి అన్నదే కతాంశం

టైటిల్ కి సరిగ్గా సరిపోయే కథ ఇది.ఇది కంప్లీట్ గా ఫారెస్ట్ బేస్డ్ బోల్డ్ స్టోరీ.ఇందులో పెద్దగా కామెడీ కి గాని,కమర్షియల్ ఎలెమెంట్స్ కి గాని పెద్దగా ఛాన్స్ లేదు.దర్శకుడు వాటిని ఇరికించే ప్రయత్నం చేయకపోవడం మెచ్చుకోదగింది.కాకపోతే జగపతి బాబు క్యారెక్టర్ ని ఇంకా ఎలివేట్ చేసుండాల్సింది.జగపతి బాబుకి మోహన్ లాల్ కి మధ్య ఇంకా మంచి హై వోల్టేజ్ సీన్స్ ఉండుంటే సినిమా ఇంకోలా ఉండుండేది.అందుకు తగ్గ స్పేస్ వున్నా దర్శకుడు ఉపయోగించుకోలేక పోయాడు.

హీరో చిన్నప్పుడు పులితో చేసే ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ .అదొక్కటే కాదు ఫైట్స్ అన్ని ఎంతో నాచురల్ గా అంతే ఎఫెక్టివ్ గా వున్నాయి..పీటర్ హెయిన్ కృషంతా స్క్రీన్ పైన కనిపిస్తుంది. మోహన్ లాల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.అతని ఎమోషనల్ యాంగ్రీ యాంగిల్స్ మనం చేసినవే కానీ మోహన్ లాల్ గారు ఓ టీనేజర్ లా చేసే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అతను ఎందుకు అంత గొప్ప నటుడో చెప్తాయి. తన కూతురితో, భార్యతో, బావతో, స్నేహితులతో అతను చేసే ఆ చిలిపి నటన చేష్టలు నిజంగా హాట్స్ ఆఫ్.

జగపతి బాబు విల్లన్ క్యారెక్టర్ చేసి చేసి పండిపోయాడు.ఇంకొన్నాళ్ళు ఇలాగే చేస్తే పాపం బొర్ కొట్టేస్తుందేమో.కాకపోతే జగ్గుని సరిగ్గా వాడుకోక పోవడం లోటు.కమలినీ ముఖర్జీ అప్ట్ సెలక్షన్ ఆ క్యారెక్టర్ కి.ప్రేమతో చిరాకు,విసుగు చూపించే భార్యగా కమలిని మెప్పించింది.మిగిలిన వాళ్లంతా వాళ్ళ వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా మాట్లాడుకుంటే పీటర్ హెయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.మోహన్ లాల్ వంటి నటుడితో ఈ వయసులో చేయించిన ఫైట్స్ నిజంగా హై లైట్.అటు పులితో జరిగే పోరాటాలు కానీ ,విల్లన్స్ తో జరిగే పోరాటాలు కానీ అద్భుతంగా వచ్చాయి.బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ బాగుంది.కెమెరా వర్క్ ఇంప్రెస్సివె గా వుంది.సీజీ వర్క్ బాగానే వుంది.పులి ఉన్న సీన్స్ అన్ని చాలా నాచురల్ గా వున్నాయి.ఎడిటింగ్ లో కత్తెరకు ఇంకాస్త పని చెప్పుండాల్సింది.సినిమా రన్ టైం ఇంకాస్త తగ్గింటే బాగుండేది.స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో కాస్త గాడి తప్పింది.అటవీ లొకేషన్స్ ,వాటర్ ఫాల్స్,రివర్ అన్ని అద్భుతంగా వున్నాయి.

మొత్తంగా మన్యం పులి ఓ వర్గం ప్రేక్షకులకి మాత్రమే నచ్చే బోల్డ్ సినిమా.రెగ్యులర్ సినిమాలతో బొర్ కొట్టేసిన ప్రేక్షకులు ఈ సినిమా తప్పకుండా చూడాలి.మోహన్ లాల్ నటన,పీటర్ హెయిన్ ఫైట్స్ సినిమాని ఏ మేరకు నిలబెడతాయో చూడాలి.