ఎన్టీఆర్ – బాబి సినిమా క్యాన్సిల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం గ‌త నాలుగు నెల‌లుగా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ సినీజ‌నాలు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ వార్త‌ల‌కు కాస్త బ్రేక్ ఇచ్చేలా కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్ 27వ సినిమా ఉంటుంద‌ని..ఈ సినిమాకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ సినిమాపై ప్ర‌చారం జ‌రిగిందే కాని ఎవ్వ‌రూ అఫీషీయ‌ల్ ఎనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ సినిమా ఉంద‌ని ఫిక్స‌యిపోయారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు న‌ట విశ్వ‌రూపం అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమాపై ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ కొత్త సినిమాపై మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, అవ‌న్నీ పుకార్లే అంటూ కొట్టిప‌డేసింది.

దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమా విష‌యంలో వ‌స్తోన్న వార్త‌ల‌న్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస హిట్ల‌తో కేరీర్‌లోనే సూప‌ర్ ఫామ్‌తో ఉన్న ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు అఫీషీయ‌ల్‌గా వెల్ల‌డిస్తారా ? అని అంద‌రూ వేయిక‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు.