బ‌న్నీ కోసం బాల‌య్య‌ను వ‌దులుకున్న దేవిశ్రీ

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆడియోను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేసి వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కంచె సినిమాకు మ్యూజిక్ అందించిన చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందిస్తున్నారు.

బాల‌య్య కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో ముందుగా ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంపిక చేసుకున్నారు. అయితే అదే టైంలో అటు మెగా స్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కు కూడా మ్యూజిక్ ఇవ్వాల్సి రావ‌డంతో దేవి చిరు కోసం బాల‌య్య‌ను వ‌దులుకున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఈ అంశంపై లేటెస్ట్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్ ఇంది. దేవిశ్రీ శాత‌క‌ర్ణిని వ‌దులుకుంది…చిరు సినిమా కోసం కాద‌ని, బ‌న్నీ దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా కోస‌మ‌ని తెలుస్తోంది. చిరు 150కు ది బెస్ట్ అందించేందుకు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిపోయాడట రాక్ స్టార్.

అయితే స‌డెన్‌గా అంత‌లోనే బ‌న్నీ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా కోసం బ‌న్నీకి ఆఫ‌ర్ వ‌చ్చింది. వెంట‌నే బ‌న్నీతో ఉన్న క్లోజ్‌నెస్ దృష్ట్యా దేవిశ్రీ బ‌న్నీ వైపే మొగ్గినట్లు తెలుస్తోంది. అయితే దీని దృష్ట్యా దేవిశ్రీకి బాల‌య్య క‌న్నా బ‌న్నీయే ఎక్కువా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.