తండ్రి కోరిక నెరవేర్చిన కొడుకు

నిజ‌మే… బాల‌య్య కోస‌మే సీనియ‌ర్ ఎన్టీఆర్.. శాత‌క‌ర్ణి లాంటి గొప్ప జాన‌ప‌ద క్యారెక్ట‌ర్‌ను చేయ‌కుండా వ‌దిలేశార‌ని ద‌ర్శ‌క దిగ్గ‌జం క్రిష్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఓ ఫంక్ష‌న్లో పాల్గొన్న క్రిష్‌.. శాత‌క‌ర్ణి విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌పై పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించాడు. క్రిష్‌-బాల‌య్య కాంబినేష‌న్‌లో చారిత్ర‌క మూవీ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి య‌మ స్పీడుగా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైల‌ర్ కూడా భారీ ఎత్తున రికార్డు సృష్టించింది. ఈ ట్రైల‌ర్‌లో బాల‌య్య ఒకే ఒక్క డైలాగ్ కూడా సూప‌ర్ డూప‌ర్‌గా హిట్ట‌యింది.

ఇక‌, ఈ మూవీ గురించి మాట్లాడిన క్రిష్‌.. బాల‌య్య వంటి హీరోతో తాను మూవీ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నాడు. ముఖ్యంగా అనేక చారిత్ర‌క రోల్స్‌తో త‌న జీవితాన్ని క‌ళామ త‌ల్లికి అంకితం చేసిన సీనియ‌ర్ ఎన్‌టీఆర్ శాత‌క‌ర్ణి పాత్ర‌ను చేయ‌కుండా దీనిని బాల‌య్య‌కే విడిచిపెట్టార‌ని క్రిష్ అన‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. ‘‘ముక్కలుగా ఉన్న రాజ్యాలన్నింటినీ కలిపి భరతఖండంగా ఒక్కతాటికి తెచ్చి ఏకఛత్రాధిపత్యంగా శాతకర్ణి ఏలాడు. అందుకు గుర్తుగానే ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.

అలాంటి చారిత్రక పురుషుడి కథను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు.. అంతగొప్ప తెలుగుజాతి చక్రవర్తి గురించి చెప్పే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా బాలకృష్ణగారి వందో సినిమాగా దీన్ని తియ్యడం నాకు దక్కిన మరో అదృష్టం. తెరపై రాజు అంటే నందమూరి బాలకృష్ణే. అరి క్రిష్ ఓ రేంజ్ చేసిన ప్ర‌సంగానికి అంద‌రూ మంత్ర‌ముగ్ధులైపోయారు. ఇక‌, 2017 సంక్రాంతికి ఈ మూవీ తెర‌మీద‌కి వ‌స్తుంద‌ని క్రిష్ చెప్పాడు. ఏదేమైనా అనేక పౌరాణిక‌, జాన‌ప‌ద మూవీల్లో న‌టించిన ఎన్‌టీఆర్.. శాత‌క‌ర్ణిని విడిచి పెట్ట‌డం నిజంగానే బాల‌య్య‌కోస‌మా అన్న‌ట్టే ఉంది!!