“గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి”ర‌న్ టైం ఫిక్స్‌

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం బాలయ్య కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు బాల‌య్య కేరీర్‌లో హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఓవ‌ర్సీస్‌లో సైతం ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య ఏ సినిమాకు జ‌ర‌గ‌ని విధంగా బిజినెస్ జ‌రిగింది.

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న శాత‌క‌ర్ణి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా ర‌న్ టైంను ద‌ర్శ‌కుడు క్రిష్ ఫిక్స్ చేశాడు. శాత‌క‌ర్ణి టోట‌ల్ ర‌న్ టైం 2 గంట‌ల 12 నిమిషాలుగా ఉండ‌నుంది. క్రిష్ గ‌త సినిమాల్లాగానే ఈ సినిమాకు సైతం త‌క్కువ ర‌న్ టైం ఉండ‌నుంది.

డిసెంబర్ 16న తిరుపతిలో నిర్వహించే ఆడియో వేడుకతో సినిమా ప్రమోషన్స్‌కు టీం శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న యువ‌రాణిగా శ్రియ న‌టిస్తుండ‌గా, బాల‌య్య త‌ల్లి పాత్ర‌ను ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ హేమ‌మాలిని న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే