బాహుబ‌లి-2 వ‌సూళ్ల లెక్క‌లు చెప్పిన రానా

బాహుబ‌లి-2 భారీ ఎత్తున కోట్లు రాబ‌డుతుందా?  బాహుబ‌లి-1ని మించి పోతుందా?  కోట్ల‌లో డ‌బ్బులు రాబ‌డుతుందా? ఇలాంటి అనేక సందేహాల‌కు ఈ మూవీలో విల‌న్ పాత్ర పోషిస్తున్న ద‌గ్గుబాటి రానా ఆన్స‌ర్లిచ్చేశాడు. బాహుబ‌లి-1ని మించిపోయి బాహుబ‌లి-2 ఉంటుంద‌ని చెప్పాడు. అంతేకాదు, బాహుబ‌లి-1కి స‌మానంగా డ‌బ్బులు రాబ‌డుతుంద‌ని, అంత‌క‌న్నా ఎక్క‌వే వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. వాస్త‌వానికి జ‌క్క‌న్న ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తున్న మూవీపై పెద్ద ఎత్తున హైప్ ఉండ‌డం స‌హజం.

ఇక తెలుగు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్మురేపిన బాహుబ‌లి సీక్వెల్ బాహుబ‌లి-2కి మ‌రింత హైప్ పెరిగింది. దీంతో ఈ మూవీ బిజినెస్ అంచ‌నాల‌ను మించిపోతుంద‌ని రానా చెబుతున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన రానా.. ఆ లెక్క‌లు వివ‌రించాడు కూడా. బాహుబ‌లి-2 వ‌సూళ్ల లెక్క‌లు చెప్పిన రానా స్ప‌ష్టం చేశాడు. గ‌తంలో ఇదే లెక్క‌ల‌పై మాట్లాడిన డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న‌.. బాహుబ‌లితో పోలిస్తే రెండో భాగానికి క‌నీసం 40 శాతం ఎక్కువ బిజినెస్ జ‌ర‌గ‌బోతోంద‌ని చెప్పారు. అంటే, బాహుబ‌లి రూ. 600 కోట్లు రాబ‌ట్టింది.

కాబ‌ట్టి బాహుబ‌లి-2 రూ.800 వ‌సూలు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, ఈ లెక్క‌ల‌పై స్పందిస్తున్న సినీ పండితులు మాత్రం బాహుబ‌లి కంటే బాహుబ‌లి 2 ప‌ది రెట్ల గొప్ప‌గా ఉంటేనే త‌ప్ప‌.. ఓ రేంజ్‌లో క‌లెక్ష‌న్స్ సాధ్యం కావ‌ని చెబుతున్నారు. స్టోరీ ప‌రంగా విజువ‌ల్ ఫీస్ట్ ప‌రంగా ఎలా చూసినా.. బాహుబ‌లి-1ని మించిపోయి ఉండాల‌ని అంటున్నారు. మ‌రి జ‌క్క‌న్న‌కు ఈ ఫార్ములా తెలీదా? అంటే తెలుసు. కాబ‌ట్టి ఆ రేంజ్‌లోనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. సో.. మొత్తానికి బాహుబ‌లి-2 వ‌సూళ్ల లెక్క రూ.600 నుంచి రూ.800 కోట్ల‌న్న‌మాట‌!!