బాలయ్య మహేష్ మల్టీ స్టారర్ రెడీ !

టాలీవుడ్ లో కాంబినేషన్ మూవీస్ కి వుండే క్రేజే వేరు. సహజంగా హీరో,డైరెక్టర్ కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు మల్టీ స్టార్స్ తో పాటు క్రేజీ డైరెక్టర్ తోడయితే ఆ సినిమా అంచనాలు ఊహకు కూడా అందవు.

ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో చర్చించు కుంటున్నారు. మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ హిట్ శ్రీమంతుడు సినిమా తీసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిన కొరటాల శివ జనతా గ్యారేజ్ తరువాత మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాను మహేష్ బాబు, బాలకృష్ణ కాంబినేషన్ లో చేయాలనీ కొరటాల శివ భావిస్తున్నాడట. ఆ విషయమై కొరటాల శివ, మహేష్ బాబు కలిసి బాలకృష్ణ తో సంప్రదించటం కూడా జరిగిందని దానికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పారని ఫిలిం నగర్ టాక్. నిజంగా ఈ బియేషన్ లో సినిమా వస్తే కలెక్షన్ల సునామి సృష్టించటం  మాత్రం కాయం.