బాబు ” తోక క‌త్తిరిస్తా ” వార్నింగ్ ఎవ‌రికి

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌భుత్వ‌ అధికార‌వ‌ర్గాల్లో ఉన్న‌పేరు అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్క‌టే.. ఆయ‌న‌కు వారిచ్చిన బిరుదు ప‌నిరాక్ష‌సుడు. చంద్ర‌బాబు అధికారంలో ఉంటే పాల‌నా యంత్రాంగం అనుక్ష‌ణం ప‌రుగులు తీయాల్సిందే. ఉన్న‌త స్థాయి అధికారుల‌నుంచి నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగుల‌దాకా అంద‌రికీ గ‌తంలో చంద్ర‌బాబు పాల‌నాశైలి అనుభ‌వైక‌వేద్య‌మే. పాల‌నలో త‌ను తీసుకున్న నిర్ణ‌యాల ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే ప్ర‌జ‌ల‌కు చేరాల‌ని, త‌న ప్ర‌భుత్వానికి మంచి పేరు రావాల‌ని చంద్ర‌బాబు స‌గ‌టు రాజ‌కీయ‌నాయ‌కుల‌కంటే కాస్త ఎక్కువ‌గా ఆశిస్తారు. అందుకోసం మిగిలిన నేత‌ల కంటే రెండింత‌లు ఎక్కువ‌ క‌ష్ట‌ప‌డ‌తారు.

అయితే ఆయ‌న స్పీడును అందుకోవ‌డం ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌తోపాటు, అధికారుల‌కూ ఒక‌ప‌ట్టాన సాధ్యంకాదు. గ‌తంలో ఆయ‌న అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఉద్యోగుల‌కు, ఆయ‌నకు అంత‌రం పెర‌గ‌డానికి  ఈ అంశ‌మే ప్ర‌ధాన కార‌ణం. 2004లో చంద్ర‌బాబు ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఉద్యోగుల్లో ఆయ‌న‌పై పెరిగిన అసంతృప్తి కూడా ఒక కార‌ణ‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ప‌దేళ్లు ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న త‌రువాత చంద్రబాబు వైఖ‌రిలో బాగా మార్పువ‌చ్చింది. మునుప‌టిలా ఆయ‌న అధికారుల‌తో అంత గ‌ట్టిగా వ్య‌వ‌హ‌రించ‌డంలేదనే అభిప్రాయం ఈ మ‌ధ్య‌కాలంలో బ‌ల‌ప‌డింది.

అయితే అవ‌స‌ర‌మైతే తాను మునుప‌టిలా మార‌డానికి ఏమాత్రం వెనుదీయ‌న‌ని తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుఅంద‌రికీ తెలిసొచ్చేలా చేశారు. అదికూడా సాదాసీదా స‌మావేశంలో కాదు.. సాక్షాత్తూ జిల్లా క‌లెక్ట‌ర్లతో ముఖ్య‌మంత్రి మీటింగ్‌లో కావ‌డం ఇక్క‌డ విశేషం.  విష‌య‌మేమిటంటే…   రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సత్వర పరిపాలన, ప్ర‌భుత్వ సంక్షేమ‌ కార్యక్రమాలను ప్రజల్లోకి ప్ర‌భావ‌వంతంగా తీసుకువెళ్లి వారిలో ఎనభై శాతం సంతృప్తి సాధించడమే లక్ష్యంగా ఇటీవ‌ల‌ కలెక్టర్ల సమావేశం ఏర్పాటుచేశారు ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు.

సెప్టెంబర్ 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగిన ఈ సమావేశాలకు 13 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు, శాఖాధిపతులు, కమిషనర్లు, సెక్రటరీలు, పోలీస్ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.  మొదటిరోజు ఉదయం షెడ్యూలు ప్రకారం ప్రారంభమైన సమావేశం కాస్త‌ ఆలస్యంగా ముగిసింది. ఇక రెండవ రోజు ముఖ్యమంత్రి కలెక్టర్లను జిల్లాలలో అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వివరించాలని ఆదేశించారు. 13 జిల్లాల కలెక్టర్లు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు తెలిపారు. అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్‌లో కలెక్టర్లు అందరూ ఎవరు ఎలా చెప్పారో చర్చించుకుంటూ విందారగించారు.

పాల‌న‌ల జిల్లా కలెక్టర్ల సమావేశం మొదటి రోజు రాత్రి 10.30కి ముగిసింది. రెండవ రోజు ఉదయం తొమ్మిది గంటలకే సమావేశం అని సీఎం చెప్పారు. తొమ్మిదింపావుకే ఆయన వచ్చేశారు. నిద్రమత్తు వదిలించుకుని వచ్చిన అధికారులు ఎట్టకేలకు సమావేశం ప్రారంభమైందనుకున్నారు. మార్నింగ్ సెషన్ పూర్తయి, మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో సుష్టిగా తిన్నారు. ఈ సమయంలోనే సీ.ఎం.ఓ అధికారుల నుంచి “సర్ రమ్మంటున్నారంటూ” కబురు అందింది. సదస్సులో మరో ఇంటర్నల్ మీటింగ్ ఏమిటని నిట్టూర్పు విడుస్తూ కలెక్టర్లు సీఎం రూములోకి వెళ్లారు. బయటికి వచ్చేసరికి తిన్న మత్తు వదిలింది. తత్వం బోధపడింది. చంద్రబాబు చెప్పిందంతా విని ఏసీ రూమ్‌లోనుంచి బయటకు వచ్చేసరికి కలెక్టర్లకు చెమటలు పట్టాయి. లోపలేమి జరిగిందో మీరే చూడండి.

విష‌య‌మేమిటంటే   రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సత్వర పరిపాలన, ప్ర‌భుత్వ సంక్షేమ‌ కార్యక్రమాలను ప్రజల్లోకి ప్ర‌భావ‌వంతంగా తీసుకువెళ్లి వారిలో ఎనభై శాతం సంతృప్తి సాధించడమే లక్ష్యంగా ఇటీవ‌ల‌ కలెక్టర్ల సమావేశం ఏర్పాటుచేశారు ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగిన ఈ సమావేశాలకు 13 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు, శాఖాధిపతులు, కమిషనర్లు, సెక్రటరీలు, పోలీస్ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.  మొదటిరోజు ఉదయం షెడ్యూలు ప్రకారం ప్రారంభమైన సమావేశం కాస్త‌ ఆలస్యంగా ముగిసింది. ఇక రెండవ రోజు ముఖ్యమంత్రి కలెక్టర్లను జిల్లాలలో అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వివరించాలని ఆదేశించారు. 13 జిల్లాల కలెక్టర్లు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు తెలిపారు. అనంతరం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్‌లో కలెక్టర్లు అందరూ ఎవరు ఎలా చెప్పారో చర్చించుకుంటూ విందారగించారు.

ఇంత‌వ‌ర‌కూ అంతా ప్ర‌శాంతంగానే సాగిపోతుంద‌నుకుంటున్న క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రినుంచి అత్య‌వ‌స‌ర పిలుపొచ్చింది. విష‌యం ఏమిటో అర్థంకాక క‌లెక్ట‌ర్లంతా ఏమిటనుకుంటూ ఒక్కొక్కరూ ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లారు. అప్పటికే ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంల‌ అక్కడ  మంత్రులను చూడగానే కొంతమంది కలెక్టర్లకు విష‌యమేంటో స‌గం అర్థ‌మైపోయింది.  ఇక అస‌లు విష‌య‌మేంటో చంద్ర‌బాబు స్వ‌యంగా  కాస్త క‌టువుగానే క‌లెక్ట‌ర్ల‌కు తెలియ‌జేశారు.  కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,  ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి నియోజకవర్గాల్లో రెండు లక్షల మంది ప్రజలతో ఎన్నుకోబడినవాళ్లని క‌లెక్ట‌ర్లు గుర్తుంచుకోవాల‌ని, వారు క‌లెక్ట‌ర్ల‌ దృష్టికి తీసుకువచ్చిన ప్రజాసమస్యలను సానుకూలంగా పరిశీలించమ‌ని సీఎం కాస్త సీరియ‌స్‌గానే క‌లెక్ట‌ర్ల‌కు త‌లంటార‌ట‌.

కొంతమంది కలెక్టర్లు ఫోన్లు ఎత్తకుండా, మంత్రులు చెప్పిన పనులు కూడా చేయడం లేదనే సమాచారం అందుతోంద‌ని,   నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాల‌ని, కానీ.. ప్ర‌జాప్ర‌త‌నిధులు చెప్పేది ఏంటో వినాల‌ని,  ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదని హెచ్చ‌రించార‌ట‌. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళితేనే, వారు 80 శాతం వరకు సంతృప్తి చెందితేనే త‌మ‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.., స‌హ‌క‌రించ‌డం ఇష్టంలేకపోతే వెళ్లిపోవ‌చ్చ‌ని, వేరేవాళ్లు వచ్చి చేస్తార‌ని వారికి చంద్రబాబు తేల్చిచెప్పేసిన‌ట్టు స‌మాచారం.

మొత్తంమీద‌ కలెక్టర్లకు సీఎం క్లాస్ తర్వాత భవిష్య‌త్ దర్శనం స్పష్టంగానే కనిపించింద‌న్న‌మాట‌.  తేడావస్తే తోక కత్తిరిస్తామ‌ని  ముఖ్య‌మంత్రి చెప్ప‌క‌నే చెప్పార‌ని బయటకు వచ్చిన ఓ కలెక్టర్ వ్యాఖ్యానించారు. అయితే చంద్ర‌బాబు స‌మావేశంలో కొంత‌మంది మంత్రుల‌కు కూడా ప‌నితీరు మెరుగుప‌రుచుకోవాల‌ని గ‌ట్టిగానే క్లాస్ పీకార‌ట‌.  అంటే పాల‌న‌తోపాటు,  పార్టీ పైన కూడా చంద్ర‌బాబు కాస్త గ‌ట్టిదృష్టిసారించిన ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఆయ‌న స్పీడును మిగిలినవారు ఎంత‌వ‌ర‌కూ అందుకుంటారో చూడాల్సిఉంది.