శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ట వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఒక వైపున షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున బిజినెస్ డీల్స్  కూడా ఫైన‌లైజ్ అవుతున్నాయి. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య త‌ల్లిగా ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ హీర‌యిన్ హేమ‌మాలిని న‌టిస్తుండ‌గా, బాల‌య్య స‌ర‌స‌న యువ‌రాణిగా శ్రియ న‌టిస్తోంది.

ఇక ఈ సినిమా ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరిపోయింది. శాత‌క‌ర్ణి సినిమా సీడెడ్ హక్కులను సాయి కొర్రపాటి దక్కించుకున్నాడు. ఇందుకు గాను ఆయన దాదాపు రూ.9 కోట్లు చెల్లించినట్టు స‌మాచారం. మిగిలిన ఏరియాలకు సంబంధించిన హక్కుల రైట్స్‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఇక ఆంధ్రా హ‌క్కులు రూ. 25-30 కోట్ల మ‌ధ్య‌లో అమ్ముడ‌వుతాయ‌ని తెలుస్తోంది. నైజాంకు సంబంధించి రూ.18 కోట్ల వ‌ర‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమా బాలయ్యకి 100వ సినిమా కావడం, బలమైన చారిత్రక నేపథ్యం ఉండటం వలన ఈ సినిమా పట్ల బయ్యర్లు ఆసక్తిని కనబరుస్తున్నట్టు సమాచారం. శాత‌క‌ర్ణి టోట‌ల్ బిజినెస్ రూ 80-85 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతి కానుగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.