శాతకర్ణి తల్లి,భార్య,బిడ్డ ఇదిగో

నందమూరి నట సింహం బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.క్రియేటివ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొరాకో,జార్జియా ల్లో కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు.భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను క్రిష్ అద్భుతంగా చిత్రీకరించాడు అని టాక్.

తాజాగా శాతకర్ణి షూటింగ్ లో అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని జాయిన్ అయ్యారు.ఇందులో శాతకర్ణికి తల్లిగా హేమమాలిని నటిస్తోంది.ఇక శాతకర్ణి భార్యగా శ్రీయ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ తాజా షెడ్యూల్ ఈ మధ్యనే మధ్యప్రదేశ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ శాతకర్ణి గెట్ అప్ లో అదుర్స్ అనిపిస్తున్నాడు.ఇక శ్రీయ,హేమామాలినీలు రాజసం ఉట్టిపడుతూ హుందాగా కనిపించారు.ఇక శ్రియ ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్నారు.శాతకర్ణి పల్లకి ముందు నడుస్తున్న ఫోజ్ లో బాలయ్య కనిపిస్తున్నారు.

ఏది ఏమైనా ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ అంతా కృత నిశ్చయంతో వుంది.ఇప్పటి వరకు అనుకున్న దానికంటే వేగంగానే క్రిష్ షూటింగ్ సాగిస్తుండడం పై అటు బాలయ్య ఇటు నిర్మాతలు సంతృప్తిగా వున్నారు.వేగంతో పాటు హై స్టాండర్డ్స్ తో ఎక్కడా రాజీ పడకుండా క్రిష్ఇప్పటివకు తీసిన సినిమా అద్భుతంగా వచ్చిందనే టాక్ నడుస్తోంది.