మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ‘పక్కా మాస్’

చాల సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ తో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్పుడే 50 శాతం పూర్తిచేసుకుంది.ఈ సినిమా సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాలలో సందడి చేసేలాగా సినిమా నిర్మాత అయిన రాంచరణ్ ప్లాన్ చేసుకున్నాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగాస్టార్ 151 వ. సినిమా ని కూడా అనౌన్స్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమా కూడా మెగా ఫ్యామిలీ నుంచే రానుంది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే సినిమా డైరెక్టర్ ఎవరనే దానిపై చాలాపేర్లే వినిపించాయి. అయితే అల్లు అరవింద్ మాత్రం 151 వ. సినిమా తనకి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను చేస్తేనే బావుంటుందని అనుకుంటున్నారట.

చిరంజీవి కూడా ఈ మధ్య తనను కలిసి బోయపాటితో ఓ మంచి లైన్‌ ఉంటే చెప్పమని మెగాస్టార్‌ అడిగారట. అంటే చిరంజీవి కూడా బోయపాటి తో సినిమాకి ఇంట్రెస్టేడ్ గానే వున్నారని తెలుస్తోంది. ఇక అన్నీ కుదిరితే చిరుని మళ్ళీ మాంచి మాస్ హీరోగా చూసే అవకాశం దొరికినట్టేనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.