భళ్లాలదేవుడి సినిమా ఫిక్స్‌ అయిపోయినట్లే.

‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానా తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఎప్పట్నుంచో తేజ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు రానా అనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆ విషయంలో ఇప్పుడ ఒక క్లారిటీ వచ్చేసింది. తేజ డైరెక్షన్‌లో రానా సినిమా చేయబోతున్నాడనే విషయం కన్‌ఫామ్‌ అయిపోయింది. ఇందులో ముద్దుగుమ్మ కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తేజ డైరెక్ట్‌ చేసిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్‌ ప్రస్తుతం నెబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ పరిచయంతోనే కాజల్‌ ఇప్పుడు తేజ సినిమాలో మళ్లీ నటించేందుకు సిద్దపడుతోందట.

ఈ సినిమాకు ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక డిఫరెంట్‌ కథా, కథనాలతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. తేజ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయన సినిమాలకు పాపులారిటీ తగ్గింది. వరుస పరాజయాలతో ఉన్న తేజ చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమాపై భారీ ఆశలతో వస్తున్నాడు. అంతేకాదు ‘బాహుబలి’ సినిమాతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రానా స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారమ్‌. మొత్తానికి ఈ సినిమా సంబంధించి మరిన్ని ఆశక్తికరమైన విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.