పవన్ కళ్యాణ్ ని ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దాని కి సంజాయిషీ కూడా ఇచ్చుకుని ఇంకెప్పుడు పవన్కళ్యాణ్ గురించి మాట్లాడాను అనికూడా చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు మళ్ళీ పవన్కళ్యాణ్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. అయితే ఈ సారి పాజిటివ్ కామెంట్స్ చేసాడు. మొన్న పవన్ తిరుపతిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభపై వర్మ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం నాకు బాగా అర్ధమైంది. అలాగే అతడు ఎంచుకున్న మూడంచెల ఉద్యమ మార్గం కూడా కరెక్ట్. పవన్ తీసుకున్న ఇంటెలిజెంట్ మూవ్మెంట్ ప్లాన్ అందరికీ అంత త్వరగా అర్ధం కాకపోవచ్చు. పవన్ లాంటి నాయకుడు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

RGV