గీతా ఆర్ట్స్‌లో పవన్‌ కళ్యాణ్‌?

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందట. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రాబోతోందని సమాచారమ్‌. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘రాజా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా రానుందన్న సంగతి తెలిసిందే. దానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్నాడన్న సంగతి కూడా తెలిసిందే. అయితే గీతా ఆర్ట్స్‌లో రాబోతున్న సినిమానే ‘రాజా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ అల్లు అర్జున్‌తో ‘డీజే’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయిన వెంటనే పవన్‌ కళ్యాణ్‌ సినిమా తెరకెక్కిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. మరో పక్క పవన్‌ కళ్యాణ్‌ కూడా సో బిజీ. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు.

 డాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కూడా పవన్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. వరుస సినిమాలతో ఇప్పుడప్పుడే పవన్‌ కళ్యాణ్‌ హరీష్‌ శంకర్‌కి దొరికేలా లేడు. కానీ కథా బలం డిమాండ్‌ చేస్తే హరీష్‌కి నెక్స్ట్‌ ఛాన్స్‌ దక్కే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో హరీష్‌, పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. మళ్లీ అదే రికార్డు ఇప్పుడు ‘రాజా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’తో రిపీట్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ ఇవ్వనున్నారని సమాచారమ్‌.