మెగా హీరోయిన్‌ తీన్‌మార్‌

మెగా ఫ్యామిలీ నుండి ‘ఒక మనసు’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది మెగా ముద్దుగుమ్మ నిహారిక. ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. వాటిలో థ్రిల్లర్‌ మూవీ ‘హ్యాపీ ఎండింగ్‌’ అనే బాలీవుడ్‌ మూవీ రీమేక్‌లో నటిస్తుంది.

కొత్త దర్శకుడు కార్తిక్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారమ్‌. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో పరిచయమైన విజయ్‌ దేవరకొండ ఆ సినిమాతో అంతగా ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయాడు. కానీ రెండో సినిమా ‘పెళ్లిచూపులు’ తో చాలా దగ్గరయ్యాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. దాంతో మెగా హీరోయిన్‌కి జోడీగా ఈ యంగ్‌ హీరో సెలెక్ట్‌ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.

ఇది కాక అల్లు అరవింద్‌ నిర్మాణంలో మెగా బ్యానర్‌లో మరో సినిమా చేయనుందట. ఈ సినిమాలో నిహారిక బబ్లీగా కనిపించే పాత్రలో కనిపిస్తుందట. సినిమా మొత్తం వినోదాత్మకంగా ఉండబోతోందట. ఇలా మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో నిహారిక కనిపించబోతోంది. ఇవి సెట్స్‌ మీదికి వెళ్లడమే ఆలస్యం. అంతేకాదు మెగాస్టార్‌ సినిమాలో కూడా నిహారిక కోసం ఒక ప్రత్యేక పాత్ర ఆల్రెడీ రెఢీగా ఉంది. సో ఈ మెగా హీరోయిన్‌ సో బిజీ అన్నమాట.