బంతిపూల జానకి TJ రివ్యూ

సినిమా:బంతిపూల జానకి
రేటింగ్:1/5
పంచ్ లైన్: జబర్దస్త్ ప్లాప్ స్కిట్
నటీనటులు:ధన్‌‌రాజ్‌, దీక్షాపంత్, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు
సంగీతం: బోలే
నిర్మాతలు: కళ్యాణి-రామ్
స్క్రీన్‌ ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌

సినిమా అంటేనే వ్యాపారం.అది కాదన లేని నిజం.అయితే ఆ వ్యాపారం కాస్తా కొత్తపుంతలు తొక్కుతోంది.తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు రావాలి అన్నదే ఇప్పుడు అందరి కాన్సెప్ట్..క్వాలిటీ సంగతై దేవుడెరుగు..ఎంత తక్కువ లో సినిమా అయితే అంత లో బడ్జెట్ లో లాగించేసి ప్రమోషన్ తో పబ్లిసిటీ కొట్టేసి జనాల్ని థియేటర్ కి రప్పిస్తే చాలు.సినిమా ఏ 50 రోజులో ఆడనవసరం లేదు కనీసం వీకెండ్ ఆడితే చాలు మనం సేఫ్ అన్న పంథాలో చాలా మంది సినిమాలు తీస్తున్నారు.

ఇదే దారిని జబర్దస్త్ గ్యాంగ్ తో తీసిన సినిమానే బంతి పూల జానకి.అంతా బానే వుంది కానీ చిన్న సినిమాకి అవసరమైన కథ కానీ..దాన్ని నడిపే కథనం గాని సినిమాలో లేవు.హర్రర్ కామెడీ..థ్రిల్లర్ కామెడీ సినిమాలు సిటీ బస్సుల మాదిరి వస్తూనే వున్నాయి.ఈ బంతిపూల జానకి కూడా అదే తరహా బస్సు.

సినిమా లో 7-8 మంది నటీనటులకంటే అవసరం ఉండదు.సినిమా దాదాపుగా ఎదో ఒక ఇంట్లో తీసేయవచ్చనే ఎత్తుగడతోనే చాలామంది థ్రిల్లర్ & హర్రర్ బేస్డ్ కామెడీ,రొమాంటిక్ అంటూ ట్రై చేస్తున్నారు.అయితే ఎంత చిన్న సినిమా అయినా కనీసం నిర్మాణ విలువలుండాలి అదిలేనప్పుడు కనీసం ప్రేక్షకుల్ని సినిమాలో 2 గంటలపాటు కూర్చోబెట్టే కథైనా ఉండాలి..ఈ సినిమాకి ఆ రెండూ లేవు.

కథ విషయానికొస్తే మోడల్ కావాలనుకునే జానకి(దీక్షా పంత్) కి స్నేహితుడు శ్యామ్ (ధన్‌రాజ్) సాయంత బంతిపూల జాన‌కి అనే సినిమా ఛాన్స్ రావడం ఆ సినిమాకి ఏకంగా జాతీయ అవార్డు రావడం అభినందించడానికి చిత్రయూనిట్ అంతా(జబర్థస్థ హోల్ టీం)వచ్చిన సందర్భంలో జరిగిన అనుకోని సంఘటనలు, వాటినుండి జానకి ఎలా బయట పడింది అనేదే కథాంశం.

జబర్దస్త్ కమెడియన్స్ అందరు వున్నారంటే కామెడీని ఓ రేంజ్ లో వూహించుకొచ్చిన ప్రేక్షకుడికి నిరాశే..కామెడీ ఎక్కడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు..జబర్దస్త్ లో లాగే అడల్ట్ కామెడీ ట్రై చేసినా క్లిక్ అవ్వలేదు.ఇక హీరోయిన్ స్కిన్ షో తో అయినా నెట్టుకొద్దామని చాలానే ట్రై చేశారు.పాటలెప్పుడొస్తాయో ఎందుకొస్తాయి తెలీదు.మిగతా స్క్రీన్ ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడటానికేం లేదు.

కమెడియన్ ధనరాజ్ ఓ వైపు సొంతంగా తీసిన పనిలేని పులిరాజు సినిమా ఘోర పరాజయం పొందితే..హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో కూడా పాపం ధనరాజ్ కి నిరాశే ఎదురయింది.అయినా ధనరాజ్ బలం ఏంటో బలహీనత ఏంటో బేరీజు వేసుకోవాలి.అంతే కానీ ఇలా తోచింది చేస్కుంటూ పోతే తరువాత చేయడానికేం మిగలదు.