జనతా గ్యారేజ్ లో ఎవరెక్కువ?

‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు సమంత, నిత్యామీనన్‌లు. అయితే ఈ సినిమాలో సమంతది మెయిన్‌ హీరోయిన్‌ రోల్‌, నిత్యా సెకండ్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా ఇంతవరకూ సమంత సినిమా ప్రమోషన్‌కి సంబంధించి బయటికి రాలేదు. ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా నిత్యా సందడే కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో కూడా నిత్యా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఎక్కువ ప్రాధాన్యత సమంత కన్నా నిత్యాకే ఉండనుందా? అనే డౌట్‌ వస్తోంది ప్రేక్షకులకి. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నిత్యా సెకండ్‌ హీరోయినే. కానీ చాలా డామినేటింగ్‌ క్యారెక్టర్‌ ఆ సినిమాలో. సెకండాఫ్‌లో వచ్చినపప్పటికీ అప్పట్నుంచీ మెయిన్‌ హీరోయిన్‌లానే అనిపిస్తూ, సమంతని ఫుల్‌గా డామినేట్‌ చేసేస్తుంది. అందులోనూ మంచి యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్న నటి నిత్య. సో ఈ సినిమాలో కూడా నిత్యా, సమంతని డామినేట్‌ చేస్తుందా? అసలే ఇప్పటికే ఆమె తన పాత్ర గురించి చెప్పుకుంటూ తానేం సెకండ్‌ హీరోయిన్‌ని కాదు. మేమిద్దరం ఇందులో ఈక్వెల్‌ రోల్‌ ప్లే చేస్తున్నాం అని చెబుతోంది. అంటేనే అర్ధం అవుతోంది ఆమె పాత్రకి ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో. ఎంతగా ఇంపార్టెన్స్‌ లేకపోతే ఆమె అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుంది. ఎక్కడ చూసినా నిత్య మేనియానే కనిపిస్తోంది ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకి ఒక రేంజ్‌ ఉంది. ఈ సినిమాతో ఆమె రేంజ్‌ మరింత పెరిగే అవకాశాలున్నానయింటున్నారు.