చిరు పార్టీకి పవన్ వైఫ్!

నిన్నంతా ఎక్కడ చూసినా చిరంజీవి పుట్టినరోజు వేళా విషేషాలే..ఉదయమంతా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ సినిమాకి సంబంధించి 1st లుక్ మోషన్ పోస్టర్ అని,చిత్ర యూనిట్ అంతా కలిసి బర్త్డే విషెస్ చెప్పిన వీడియోస్ ని విడుదల చేయడం అని చిరు ఫాన్స్ పూజలు..చారిటి కార్యక్రమాలతో గడిచిపోయింది.

ఇక సాయంత్రం అభిమానులకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మెగా వారసులందరు పాల్గొని అభిమానుల్ని అలరించారు.అయితే చిరంజీవి ఉదయం నుండి ఎక్కడా కనిపించలేదు.పుట్టినరోజు పార్టీ ని సినీ రాజకీయ సన్నిహితుల మధ్య పార్క్ హయత్ హోటల్ లో చిరు చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఈ కార్యక్రమానికి సినీప్రముఖులెందరో హాజరయ్యారు.ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు.వీరితో పాటు చిరు ప్రతి ఫంక్షన్ కి హాజరయ్యే వాళ్లలో ముందుండే కెసిఆర్ కుమారుడు కేటీర్ కూడా హాజరయ్యాడు .అయితే ఈ ఫంక్షన్ కి ఎప్పటిలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డుమ్మాకొట్టడం విశేషం.

ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండోయ్.పవన్ రాకపోయినా పవన్ కళ్యాణ్ తాజా సతీమణి Anna Lezhneva హాజరయి అందర్నీ ఆశ్చర్య పరిచింది.అయినా పవన్ మెగా ఫామిలీ ఫంక్షన్స్ అన్నిటికీ దూరంగానే ఉంటున్నాడు.ఆమధ్య చిరు చిన్న కూతురి శ్రీజ పెళ్ళికి కూడా పవన్ గబ్బర్ సింగ్ షూటింగ్ సాకు చూపి తప్పించుకున్నాడు.ఆ ఫంక్షన్ కి కూడా పవన్ భార్యనే పంపడం విశేషం.