కత్రినాకి అదేం కొత్త కాదు

తెలుగులో వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’ సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌. ఈ సినిమాలో ఆమె నటనకు, డాన్సులకు చాలా విమర్శలు ఎదుర్కొంది. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన కత్రినా కైఫ్‌కి తొలి నాళ్లలో నటన పట్ల అంతగా అవగాహన లేదు. అలాగే డాన్సుల్లో కూడా ఆమె చాలా వీక్‌. అయినప్పటకీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.

కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఆమెకు విమర్శలు తప్పలేదు. కానీ కాలక్రమేణా ఈ ముద్దుగుమ్మలో చాలా మార్పులు వచ్చాయి. డాన్సుల్లో ప్రస్తుతం బాలీవుడ్‌ క్వీన్‌గా చెలామణీ అవుతోంది. అందుకు ఈ ముద్దుగుమ్మ చాలానే కష్టపడింది. కష్టపడి తనేంటో నిరూపించుకుంది. విమర్శించిన వారినే ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. సహజంగా బాలీవుడ్‌లో అందాల ఆరబోతకి ఏ హీరోయిన్‌ వెనుకాడదు. అందులో కత్రినాది కొంచెం డోస్‌ ఎక్కువే.

ఈ ముద్దుగుమ్మ తన హాట్‌ హాట్‌ అందాలను బికినీలో చాలాసార్లు ప్రదర్శించింది. అయితే తాజా మూవీ ‘బార్‌ బార్‌ దేఖో’లో ఈ ముద్దుగుమ్మ బికినీ అందాల ప్రదర్శన బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది. బికినీతో అందాల ఆరబోతే కాకుండా ఆమె చేసే డాన్సులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయట. తోటి హీరోయిన్స్‌కి అయితే అసూయ కల్గించేలా ఉంటాయట అందర్నీ ఆంతగా ఆశ్చర్యపరిచేంతగా మరి కత్రినా బికినీ స్పెషల్‌ ఏంటో మరి.