ఇలియానా దశ తిరగనుందా?

ఈ మధ్య ఇలియానాకి తెలుగులోనూ, హిందీలోనూ ఎక్కడా కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ‘రుస్తుం’ సినిమా విడుదలైంది. హిట్‌ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇలియానా పనయిపోయింది అనుకున్న టైంలో ఈ సినిమా ఆమెకు కొంత రిలీఫ్‌నిచ్చినట్లే. ఈ సినిమా సక్సెస్‌తో ఆమెకు మళ్లీ అవకాశాలు దక్కుతాయేమో అని ఆశిస్తోంది. తెలుగులో కూడా ఆమె నటించడానికి రెఢీగా ఉంది.

అయితే అవకాశాలే కరువయ్యాయి. మరి బాలీవుడ్‌లో ‘రుస్తుం’ సినిమా విజయంతో ఆమె అక్కడ బిజీ అయ్యిందంటే ఇకపై తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించేందుకు అవకాశాలు తక్కువే అని అంటున్నారు. ఏది ఏమైనా ఒక సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న ఇల్లీ బేబీ కోరిక నెరవేరినట్లే ఈ సినిమాతో. అయితే ఇల్లూ బేబీ మాత్రం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకుంటానంటోంది.

తెలుగులోనైనా, హిందీలోనైనా, ఫుల్‌ బిజీగా గడపాలనుకుంటోందట ఇకపై ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తన తోటి సీనియర్‌ హీరోయిన్లైన అనుష్క, నయనతార, త్రిషల మాదిరిగా విలక్షణ పాత్రల్లో నటించాలనుకుంటోందట. ఇప్పటికే టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత కారణంగా, ఇలియానా పేరు పలు సినిమాల కోసం పరిశీలనలో ఉంది. ఇలియానాకి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో లక్‌ కలిసొస్తుందో లేదో చూడాలిక.